13 ఏళ్ల వయస్సులోనే PCOS!

6
- Advertisement -

ఒకప్పుడు పెద్ద మహిళల్లోనే ఎక్కువగా కనిపించిన పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) ఇప్పుడు టీనేజ్ బాలికల్లోనూ వేగంగా పెరుగుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. భారత్‌లో ప్రస్తుతం 13 ఏళ్ల వయసు బాలికల్లో కూడా పీసీఓఎస్ కేసులు గుర్తించబడుతున్నాయి. ఇది ముందస్తు అవగాహన అవసరాన్ని మరింత స్పష్టంగా చూపిస్తోంది.

దేశంలో నిర్వహించిన పలు అధ్యయనాల సమీక్ష ప్రకారం బాలికల్లో పీసీఓఎస్ ప్రబలత సుమారు 17–18 శాతంగా ఉంది. దక్షిణ భారతదేశంలో 15–18 ఏళ్ల బాలికలపై చేసిన ఒక అధ్యయనంలో 9.1 శాతం మందికి పీసీఓఎస్ లక్షణాలు ఉన్నట్లు తేలింది. కర్ణాటకలో సుమారు ప్రతి 10 మంది బాలికల్లో ఒకరికి హార్మోనల్ అసమతుల్యత ఉందని బెంగళూరు పరిశోధనలు సూచిస్తున్నాయి. 2035 నాటికి భారతదేశంలో కిశోర స్థూలకాయం సంవత్సరానికి 9% చొప్పున పెరుగుతుందని అంచనా వేస్తుండటంతో, ఈ సంఖ్యలు ఇంకా పెరిగే అవకాశం ఉంది.

దీనికి ప్రధాన కారణ.. అధిక బరువు హార్మోన్ల అసమతుల్యతను పెంచడం, మారుతున్నన్న ఆహారపు అలవాట్లు: ప్రాసెస్డ్ ఫుడ్, చక్కెర పానీయాలు, ఫాస్ట్ ఫుడ్ పెరగడం.సరియైన నిద్ర లేకపోవడం, ఫోన్ వినియోగం ఎక్కువ, బయట ఆటలు తక్కువ. జన్యుపరమైన పాత్ర కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Also Read:వాట్సాప్ డేటా సేకరణ..అనుమతి తప్పనిసరి!

పీసీఓఎస్ శరీరానికే కాదు, ఆత్మవిశ్వాసం, ఆందోళన, సామాజిక ఒంటరితనం వంటి భావోద్వేగ సమస్యలకు కూడా దారి తీస్తుంది. సరియైన వ్యాయామం,తల్లిదండ్రులు నెలసరి సమస్యలపై అవగాహన, వైద్యులు వయసుకు తగిన పరీక్షలు చేసి అవసరమైనప్పుడు ముందుగానే చికిత్స ప్రారంభించాలి. పబ్లిక్ హెల్త్ క్యాంపెయిన్లు కూడా అవగాహన పెంచడంలో కీలకం. ఈ కథనంలో ఇచ్చిన సూచనలు సాధారణ సమాచారం కోసం మాత్రమే.

- Advertisement -