- Advertisement -
రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరుగా కొనసాగుతోంది. రోజు రోజు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్ని మొక్కలు నాటుతున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో ఉన్న పీసీసీఎఫ్ మోహన్ చంద్ర పర్గెయిన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్ని మొక్కలు నాటారు. పాల్వంచ అటవీ శాఖ కార్యాలయంలో సతీమణి కంచన్తో కలిసి వేప, జమ్మి మొక్కలను నాటారు. సీఎం కేసీఆర్ హరితహారం స్పూర్తితో ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ కార్యక్రమం లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. అందరం కలిసి పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
- Advertisement -