వృత్తి కాఠిన్యం… మనసు లావణ్యం..

473
PC Mahesh Bhagwat

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కోహెడలో నూతనంగా పండ్ల మార్కెట్ నెలకొల్పుతున్నారు. అయితే కరోన వల్ల ఇక్కడ పలు ఏర్పాట్లు, రక్షణ చర్యలను పర్యవేక్షించడానికి రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మార్కెట్ వచ్చారు. ఇందులో భాగంగా మార్కెట్లోకి వెళ్లే సమయంలో మామిడి కాయలు రాసులుగా పోసిఉండటంతో అధికారులు, సిబ్బంది వాటిపైనుంచే తొక్కుకుంటూ వెళ్లారు.

కానీ కమిషనర్ మహేష్ భగవత్ మాత్రం అలా వెళ్లడం ఇష్టం లేక తన షూస్ ను (పాదరక్షలు) విడిచి తన చేతుల్తో పట్టుకొని ఇలా జాగ్రత్తగా ముందుకెళ్లారు. రైతు కష్టార్జితం అనుకున్నారో, అందరూ తినేవి అనుకున్నారో కానీ తన మృదుస్వభావం, మంచి మనసును ఇలా చాటుకున్నారు.

PC Mahesh Bhagwat IPS