బాలీవుడ్ పై పాయ‌ల్ కామెంట్స్

515
Payal Rajputh
Payal Rajputh
- Advertisement -

ఆర్ ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది పాయ‌ల్ రాజ్ పుత్. ఈమూవీ విజయం సాధించ‌డంతో యూత్ లో మంచి క్ర‌ేజ్ ను సంపాదించుకుంది. తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య పై స్పందించింది పాయ‌ల్ రాజ్ పుత్. సుశాంత్ లాగే త‌న‌కు కూడా కెరీర్ ఆరంభంలో చాలా అవ‌మానాలు జ‌రిగాయ‌ని తెలిపింది.

గ‌తంలో తాను బాలీవుడ్ లో ఆఫ‌ర్ల కోసం ప్ర‌య‌త్నిస్తుండ‌గా నువ్వు సినిమాల‌కు పనికి రావు అని అన్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. వాళ్లు అలా అన్న‌ప్పుడు తాను చాలా బాధ‌ప‌డ్డాన‌ని చెప్పింది. అప్పుడు తాను ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసుకుని ఇప్పుడు ఆమె ట్వీట్ చేసింది. మ‌న‌కు ఉన్న బాధ‌ల‌ను ఇత‌రుల‌తో పంచుకోవ‌డం వ‌ల్ల ఉపశమనం పొందవచ్చని తెలిపింది. కాగా పాయ‌ల్ ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ్ సినిమాల్లో న‌టిస్తుంది.

- Advertisement -