ట్రెడిషనల్‌ లుక్‌లో పాయల్‌..!

53
heroine

ఒక్క సినిమాతో టాలీవుడ్ కుర్రకారుపై చెరగని ముద్ర వేసిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఆర్ ఎక్స్ 100 సినిమాతో కుర్రకారు మతులు పోగొట్టిన ఈ పంజాబి బ్యూటీ తొలి సినిమా హిట్ తర్వాత వరుస ప్రాజెక్టులతో బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది.

తర్వాత ‘ఆర్‌డీఎక్స్100’, ‘వెంకీమామ’, ‘డిస్కోరాజా’ వంటి సినిమాల్లో నటించి.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఓ వైపు గ్లామరస్ రోల్స్ చేస్తూనే మరో వైపు కాంటెంట్ ఉన్న పాత్రల కోసం వెయిట్ చేస్తుంది పాయల్. ఇక సోషల్‌మీడియాలో పాయల్ అందాల ఆరబోత గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఆమె పోస్ట్ చేసే ఫోటోలు, వీడియోలు.. కుర్రాళ్ల మతులు పోగొడుతుంటాయి.

అయితే తాజాగా రొటిన్‌కు భిన్నంగా ఓ ఆసక్తికర ఫోటోను షేర్ చేసింది పాయల్. ట్రెడిషనల్‌ లుక్‌లో చీర కట్టుతో ఆకట్టుకుంది. తాజాగా పాయల్ అందాలను చూసి మంత్రముగ్దులవుతున్నారు ఫ్యాన్స్‌.