బాలయ్యతో ‘ఆర్ ఎక్స్ 100’ బ్యూటీ రొమాన్స్‌..!

555
- Advertisement -

టాలీవుడ్‌లో ‘ఆర్ఎక్స్100’ సినిమాతో తన బోల్డ్ యాక్టింగ్ తో ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారింది పాయల్ రాజ్‌పుత్‌. దీంతో ఈ అమ్మడు సినీ అభిమానులలో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆ మూవీ తరువాత కుదిరితే కథానాయిక.. లేదంటే ఐటమ్ సాంగుకైనా రెడీ అంటూ తన జోరు చూపిస్తోంది. భారీ అందాలతో వయ్యారాలు ఒలకబోసే ఈ సుందరి ఇతర భాషా చిత్రాల దర్శక నిర్మాతల దృష్టిలో పడుతోంది. తాజాగా ఈ బ్యూటీకి ఓ భారీ ఆఫర్‌ వచ్చినట్లు తెలుస్తోంది.

payal

బోయపాటి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న బాలయ్య నెక్స్ట్ సినిమాలో పాయల్ ఛాన్స్ కొట్టేసినట్లు టాలీవుడ్ తాజా సమాచారం. బోయపాటి ఈ సినిమా కోసం చాలా మంది టాప్ హీరోయిన్లను కలిసినా అందరూ కోట్లలో పారితోషికాన్ని అడుగుతున్నారట. అందుకే పాయల్‌ను తీసుకుంటున్నారని టాక్‌. పాయల్‌ అయితే పారితోషికం తక్కువ .. గ్లామరస్ డోస్ ఎక్కువ కనుకనే పాయల్ ను ఎంపిక చేసినట్టుగా చెప్పుకుంటున్నారు.

- Advertisement -