హీరోయిన్ పాయల్ రాజ్పుత్ సినీ కెరీర్ లో ఎదురైన అనుభవాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పాయల్ మాట్లాడుతూ.. ‘ఆర్ఎక్స్ 100 సినిమా విజయం తర్వాత నాకు చాలా అవకాశాలు వచ్చాయి. ఆ సమయంలో నేనొక్కదాన్నే హైదరాబాద్లో ఉన్నాను. దీంతో కొంతమంది అడ్వాంటేజ్ తీసుకున్నారు. వారంతా నన్ను తప్పుదోవ పట్టించారు. నేను కూడా వారిని గుడ్డిగా నమ్మాను. అప్పుడు నాకు తెలుగు సరిగ్గా అర్థం అయ్యేది కాదు. దాంతో నన్ను వాళ్ళు చాలా ఈజీగా మిస్ గైడ్ చేశారు. కొంతమంది దర్శకులు అయితే నన్ను వాడుకున్నారు” అని పాయల్ షాకింగ్ కామెంట్స్ చేసింది.
పాయల్ రాజ్పుత్ ఇంకా మాట్లాడుతూ.. ‘నేను నటిని. ఇండస్ట్రీకి వచ్చే ముందే అన్నీ నిర్ణయించుకునే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఎన్నో ఉంటాయి. అన్నిటిని తట్టుకుని, అందర్నీ కలుపుకుని పోతేనే ఇక్కడ ఉండగలం. ఈ క్రమంలో ఈ పరిశ్రమలో టాప్ లోకి వెళ్తాం.. అలానే కిందికీ పడిపోతాం. కానీ తట్టుకొని నిలబడాలి. ఎప్పటికప్పుడు నెగటివిటీని వదిలేసి, పాజిటివ్ గా ముందుకు వెళ్ళాలి. ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు వారి వల్ల మనకేం లాభం అని ఆలోచించుకుని అందుకు తగ్గట్టు ప్రవర్తించాలి. అప్పుడే బాగుంటాం’ అని పాయల్ కామెంట్స్ చేసింది.
Also Read:జవాన్, సలార్ కు భారీ డిమాండ్
ప్రస్తుతం పాయల్ ‘మంగళవారం’ అనే సినిమా చేస్తోంది. తనకు తొలి సినిమాలో అవకాశం ఇచ్చిన అజయ్ భూపతి డైరెక్షన్లోనే ఈ సినిమారాబోతుంది. అన్నట్టు పాయల్ ఇప్పుడు బాగా అలోచించి నిర్ణయాలు తీసుకుంటుందట. ఎలాంటి సినిమాలు చెయ్యాలో బాగా అలోచించిన తర్వాతే సంతకం చేస్తున్నానని చెబుతుంది.
Also Read:షుగర్ పేషెంట్లకు ఈ మొక్క.. అద్బుతవరం!