పాయల్‌ను కూడా రమ్మన్నారట..!

169
Payal asked for a commitment

కాస్టింగ్‌ కౌచ్‌ పై ఫిల్మ్‌ఇండస్ట్రీలో ఎంత రచ్చజరిగిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై ‘ఆర్‌ఎక్స్‌ 100’ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌ కూడా కామెంట్ చేసింది. అవకాశాలిస్తామని అమ్మాయిలను పడకగదికి రమ్మని పిలవడం 100 శాతం నిజమని అంటోంది‌. ‘ఆర్‌ఎక్స్‌ 100’ మూవీలో బోల్డ్‌గా నటించినందుకు తనని కూడా అదే బాపతు అమ్మాయిగా భావించారేమోనని చెప్పుకొచ్చిన ఈ బ్యూటీ.. నాలుగు రోజుల క్రితం తనను కాంప్రమైజ్ కావాలని ఒకరు ప్రపోజ్ చేశారని వెల్లడించింది.

Payal asked for a commitment

ఇదే మాటను తప్పకుండా ప్రచురించాలని చెప్తూ..”ఐయామ్ రియల్లీ షాక్డ్. ఇటువంటి కోరికతో ఒకరు నా ముందుకు వచ్చారు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. నేను కాంప్రమైజ్ అయి ఈ స్థాయికి రాలేదు. నేను టాలెంట్ తోనే వచ్చాను. నేను చెప్పదలచుకున్నది అదే” అని చెప్పింది. తన జీవితంలో ఎన్నడూ కాంప్రమైజ్ అయ్యేపనే లేదని కుండబద్దలు కొట్టింది పాయల్ రాజ్ పుత్. ఇక తనను ఇలా అడిగింది ఎవరన్న విషయాన్ని మాత్రం పాయల్‌ వెల్లడించలేదు.