పవన్, రానా కాంబోలో మ‌ల్టీస్టారర్‌..?

103
pawan

ప్రస్తుతం టాలీవుడ్‌లో మల్టీ స్టారర్ సినిమాల హవా కొనసాగుతోంది. ఇప్పటికే స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్నారు. మంచి కథ దొరికి.. అందులోని పాత్రలు తమకు నచ్చితే కనుక ఇలాంటి సినిమాలు చేయడానికి మన హీరోలు ఎటువంటి సంకోచం లేకుండా ముందుకొస్తున్నారు. అయితే తాజాగా అరుదైన కాంబినేష‌న్ తెర‌పై సంద‌డి చేయ‌నున్న‌ట్టు సమాచారం.

ఈ క్రమంలో పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కలసి ఓ చిత్రంలో నటించనున్నారన్న వార్త తాజాగా టాలీవుడ్‌లో వినిపిస్తోంది. మలయాళంలో హిట్టయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి గత కొంత కాలంగా సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ప‌వ‌న్ కళ్యాణ్ ప్ర‌స్తుతం న‌టిస్తోన్న వ‌కీల్ సాబ్ షూటింగ్ ఈ నెలలో పూర్తికానుంది.

అలాగే డైరెక్టర్‌ క్రిష్‌తో ప‌వ‌న్ చేయ‌నున్న సినిమాకు మ‌రికొంత స‌మ‌యం ప‌ట్ట‌నుండ‌టంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు డిసెంబ‌ర్ నుంచి మార్చి వ‌ర‌కు టైం దొర‌కనుంది. ఈ గ్యాప్‌లో రానాతో క‌లిసి మ‌ల్టీస్టారర్‌ను చేయాల‌ని ప‌వ‌న్ అనుకుంటున్నాడ‌ట‌. ప‌వ‌న్ ఈ సినిమా చేసే అవ‌కాశ‌ముండ‌టంతో రానా కూడా ఈ ప్రాజెక్టు చేయాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.