కొందరు హీరోలు రైటర్ గా , దర్శకుడిగా ట్రై చేశారు కానీ వర్కౌట్ అవ్వలేదు. అందులో పవన్ కళ్యాణ్ ఒకడు. అవును పవర్ స్టార్ గా మాంచి క్రేజ్ ఉన్న టైంలో దర్శకుడిగా మారి ‘జానీ’ కోసం మెగా ఫోన్ పట్టాడు పవన్. రిజల్ట్ ఏమైందో అందరికీ తెలిసిందే. కాకపోతే టెక్నికల్ గా పవన్ కి ఆ సినిమా మంచి పేరే తెచ్చింది. ఇక చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కోసం కథ ఇచ్చాడు. ఆ సినిమా రిజల్ట్ కూడా తేడా కొట్టేసింది. ఆ రెండు సినిమాలతో దర్శకుడిగా , రైటర్ సక్సెస్ అందుకోలేకపోయాడు పవన్.
ఇప్పుడు మరోసారి రైటర్ గా అవతారమెత్తి మళ్ళీ లక్ చెక్ చేసుకోవాలని భావిస్తున్నాడట పవన్. హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా చేయాల్సి ఉంది. కొన్ని నెలలుగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళకుండా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. తాజాగా పవన్ హరీష్ ఓ మీటింగ్ పెట్టుకున్నారని టాక్. హరీష్ చెప్పిన కథ కాకుండా సొంత కథతో సినిమా చేయాలని పవన్ డిసిషన్ తీసుకున్నారని తెలుస్తుంది.
పవన్ అభిమానులను దృష్టిలో పెట్టుకొని పవన్ కోసం ఓ కథ సిద్దం చేసుకున్నాడు హరీష్. మరి కథలో పవన్ కి ఏమైనా సందేహాలు అనిపించాయో ? ఏమో కానీ ఉన్నపళంగా ఆ కథ వద్దని చెప్పి తను రాసుకున్న కథతో సినిమా చేద్దామని హరీష్ తో అలాగే మైత్రి నిర్మాతలతో చెప్పి అంతా ఫిక్స్ చేసుకున్నాడని అంటున్నారు. ఈ వార్తలో నిజమెంత అనేది తెలియదు కానీ పవన్ సొంత కథ అనే న్యూస్ బయటికి రాగానే వామ్మో వద్దు బాబోయ్ అంటూ పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటున్నారు. గతంలో పవన్ రచనతో తీసిన చేదు గుర్తులు ఇంకా ఫ్యాన్స్ మర్చిపోలేక పోతున్నారు. మరి ఫ్యాన్స్ ఫీడ్ బ్యాక్ తెలుసుకొని ఆ ఆలోచన విరమించుకుంటే బెటరేమో.. లేదంటే పవన్ మరో అపజయం అందుకోవాల్సి వస్తుంది కాబోలు.
ఇవి కూడా చదవండి…