చిన్న సినిమాలకు పవన్ చెక్

191
- Advertisement -

వచ్చే ఏడాది ఆరంభం నుండే బడా సినిమా బాక్సాఫీస్ దగ్గర క్యూ కట్టడంతో వచ్చే శుక్రవారం చిన్న సినిమాలన్నీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.ఆది సాయి కుమార్ టాప్ గేర్ , ఆనంద్ రవి కొరమీను , సోహైల్ లక్కీ లక్ష్మణ్, గీత సాక్షిగా, నువ్వే నా ప్రాణం, ప్రేమ దేశం ఇలా అరడజను సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవ్వనున్నాయి.

అయితే తమ సినిమాలు మరో బడా సినిమా ఎఫెక్ట్ లేదని భావించిన చిన్న దర్శక, నిర్మాతలకు పవన్ ఖుషి రూపంలో చెక్ పెట్టాడు. డిసెంబర్ 31న ఫ్యాన్స్ కోసం ఖుషి సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు నిర్మాత ఏ ఎం రత్నం. ఇప్పటికే బుకింగ్స్ ఓ రేంజ్ లో నడుస్తున్నాయి.

మెగా ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ అంతా ఖుషి మళ్లీ థియేటర్స్ లో చూసేందుకు ఆసక్తి చూపిస్తుండటంతో ఈ సినిమా ఎఫెక్ట్ చిన్న సినిమాలపై గట్టిగా పడనుంది. అసలే పదుల సంఖ్యలో తెగే టికెట్లు కూడా ఇప్పుడు ఖుషి ఎఫెక్ట్ తో తెగని పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ఖుషి చిన్న సినిమాలకు వచ్చే వారం చెక్ పెట్టి మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశం కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి…

2023 కోసం పూజా వెయిటింగ్

ప్రభాస్, ప్రశాంత్ నీల్ మరోసారి?

పవన్ ఫ్యాన్స్ ఇగోని సంతృప్తిపరిచిన బాలయ్య

- Advertisement -