చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా అక్కడి ఆలయాలను సందర్శిస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆదివారం కాలినడకన శ్రీవారిని దర్శించుకున్న పవన్…ఇవాళ శ్రీకాళహస్తీలో వాయులింగేశ్వరుడిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన పవన్‌కు ఈవో భ్రమరాంబ ఘన స్వాగతం పలికారు. ఆలయ పండితులు ఆశీర్వచనాలు అందించి… స్వామివారి తీర్థ ప్రసాదాలను పవన్‌కు అందజేశారు. అనంతరం గుడిమల్లం పరుశురామశ్వేరస్వామి ఆలయం, వికృతమాలలోని శ్రీ సంతాన వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. పవన్ రాకతో శ్రీకాళహస్తిలో సందడి వాతావరణం నెలకొంది. పవన్ అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పవన్ సీఎం, సీఎం అంటూ నినాదాలు చేశారు.
మరోవైపు తిరుమల శ్రీవారిని సినీ నటి కిర్తీసురేష్ దర్శించుకున్నారు. మహానటి సక్సెస్ సాధించడంతో పాటు భారీ వసూళ్లను రాబడుతోంది. కీర్తి సురేష్ తన నటనతో విమర్శకు ప్రశంసలను పొందింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకుని స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి సైతం శ్రీవారిని దర్శించుకున్నారు. అష్టదళ పాదపద్మారాధన సేవలో కుటుంబ సభ్యులతో కలసి పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికారు. పళనికి టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలను, శ్రీవారి చిత్రపటాన్నిఅందజేశారు.