పవన్ విజయ యాత్ర.. లక్ష్యమదే !

67
- Advertisement -

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎట్టకేలకు వారాహి పై తన విజయయాత్ర ను మొదలు పెట్టాడు. నేటి నుంచి ప్రారంభం అయిన విజయ యాత్ర ఉభయ గోదావరి జిల్లాల్లోని 11 నియోజిక వర్గాల్లో కొనసాగనుంది. ఎన్నో రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న పవన్ వారాహి యాత్ర.. నేటి నుంచి ప్రారంభం కావడంతో జనసేన పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నెలకొంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ సర్కార్ ను గద్దె దించడమే లక్ష్యంగా పవన్ ఈ యాత్రను మొదలు పెట్టారు. ఇప్పటికే వైసీపీ నేతలపై, జగన్ సర్కార్ పై నిప్పులు చెరుగుతున్న పవన్.. ఈ యాత్రలో భాగంగా విమర్శల ఘాటును మరింత ఉదృతం చేసే అవకాశం ఉంది.

కాగా ఎన్నికలకు కేవలం పది నెలలు మాత్రమే సమయం ఉండడంతో ఈ యాత్రలో పవన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయనున్నారు ? ఎలాంటి హామీలు ఇవ్వనున్నారు ? అనేది ఆసక్తికరంగా మారింది. కాగా టీడీపీతో పొత్తును దాదాపు ఖాయం చేసుకున్న పవన్… ఈ యాత్రలో భాగంగా టీడీపీ ప్రస్తావన తీసుకొస్తారా ? అనేది కూడా ఆసక్తిరేకెత్తిస్తున్న అంశమే. అలాగే నియోజక వర్గాల వారీగా యాత్ర కొనసాగుతుండడంతో ఆయా నియోజిక వర్గాల్లో అభ్యర్థుల ప్రకటన కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన ఆశ్చర్యం లేదు.

Also Read: CMKCR:వైద్యరంగంపై విమర్శలే ఎక్కువ..ప్రశంసలు తక్కువ

కాగా ఇప్పటికే టీడీపీ మేనిఫెస్టో ప్రకటించి.. పోలిటికల్ హిట్ ను పెంచింది. ఇప్పుడు జనసేన కూడా ఆ దిశగా అడుగులు వేస్తే ఏపీలో ఎన్నికల వేడి మరింత రాజుకునే అవకాశం ఉంది. అయితే మొదటి నుంచి కూడా వైసీపీని గద్దె దించడమే తన లక్ష్యం అని చెబుతున్నా పవన్.. కేవలం ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎత్తి చూపేందుకే యాత్రలో అధిక సమయం కేటాయించే అవకాశం ఉందనేది కొందరి విశ్లేషకుల అభిప్రాయం. మొత్తానికి లక్ష్యం ఏదైనా పవన్ యాత్ర ప్రారంభం కావడంతో ఏపీలో పోలిటికల్ హిట్ ఒక్కసారిగా పెరిగింది. మరి పవన్ యాత్రకు కౌంటర్ గా వైసీపీ ఏం చేస్తుందో చూడాలి.

Also Read: CMKCR:తెలంగాణ ప్రజల ఆకాంక్షల నిర్మాణం

- Advertisement -