గత వారం రోజులుగా ఏపీ రాజకీయాల్లో పవన్ వెయ్యికోట్ల బేరం అనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. బిఆర్‌ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్.. పవన్ తో పొత్తు కోసం వెయ్యికోట్లు ఆఫర్ చేశారని, దీనికి పవన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని, అయినప్పటికి రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం కష్టమని ఓ ప్రముఖ వార్తా పత్రిక గత వారంలో ఓ విశ్లేషణ కథనాన్ని ప్రచురించింది. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. పవన్ కు బిఆర్‌ఎస్ ఆఫర్ చేయడం ఏంటని అందరిలోనూ ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే ఆ కథనాన్ని ప్రచురించిన వార్తా పత్రిక.. ఎల్లో మీడియా అనే సంగతి అందరికి తెలిసిందే.
ఏపీలో వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ కూడా పోటీలో నిలిచే అవకాశం ఉంది. కేసిఆర్ కు ఏపీలో కూడా మంచి ప్రజాధరణ ఉంది. పక్కరాష్ట్రమే అయినప్పటికి తెలంగాణలో కేసిఆర్ చేసిన అభివృద్దికి ఏపీ ప్రజలు మొదటినుంచి కూడా సానుకూలత వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పోటీలో నిలిస్తే ప్రధాన పార్టీలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ముఖ్యంగా టీడీపీకి అధిక నష్టం జరుగుతుందని కొందరి అభిప్రాయం. అందుకే బిఆర్‌ఎస్ విషయంలో ఏపీ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఆ మీడియా ప్రయత్నిస్తోందనే సంగతి ఇట్టే స్పష్టమౌతోంది.
పవన్ వెయ్యి కోట్ల డీల్ అంటూ వైరల్ అవుతున్న ఈ పోలిటికల్ రూమర్ ను బిఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కేసిఆర్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకే ఇలాంటి రూమర్స్ సృష్టిస్తున్నారని..ఈ రూమర్స్ సృష్టిస్తున్న వాళ్ళు దిగజారి ప్రవర్తిస్తున్నారని ఏపీ బిఆర్‌ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు. ఇలాంటి తప్పుడు కథనాలను రాష్ట్ర ప్రజలు నమ్మే అవకాశం లేదని ఆయన అన్నారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తలలో ఎలాంటి వాస్తవం లేదని అందరికి తెలుసు. కానీ ఇప్పటి నుంచే బిఆర్‌ఎస్ పై రూమర్స్ రావడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ప్రభావం గట్టిగా ఉండే అవకాశం ఉందనే భావనతోనే ఎల్లో మీడియా పవన్ తో వెయ్యికోట్లు అంటూ కొత్త అల్లికను సృస్టించింది. మొత్తానికి ఏపీలో బిఆర్‌ఎస్ ఎంట్రీతో ప్రధాన పార్టీలలో అలజడి పెరిగినట్లే కనిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో బిఆర్‌ఎస్ పైన అధినేత కేసిఆర్ పైనా ఇంకెన్ని రూమర్స్ వస్తాయో చూడాలి.
ఇవి కూడా చదవండి…