పవన్ యాత్ర మళ్ళీ షురూ..?

38
- Advertisement -

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆ మద్య మొదటి దశ వారాహి యాత్ర ముగించిన తరువాత వరుసగా వరుసగా పార్టీ కార్యకర్తలతో సమావేశాలు, ముఖ్య నేతలతో బేటీలు నిర్వహిస్తూ దిశ నిర్దేశం చేస్తున్నారు. అంతే కాకుండా ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పొత్తులపై తుది నిర్ణయం తీసుకునే కసరత్తులు కూడా జరుపుతున్నారు. ఇప్పటికే బిజెపి అగ్రనాయకత్వంతో పలు మార్లు బేటీ అయిన పవన్.. పొత్తు ఉంటుందని తేల్చి చెప్పారు కూడా. కానీ బీజేపీతో కలిసి నడిచే రూట్ మ్యాప్ పై మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. .

ఇదిలా ఉంచితే వారాహి యాత్రలో భాగంగా జగన్ సర్కార్ పై ఘాటైన విమర్శలు ఎక్కుబెట్టి పోలిటికల్ హిట్ పెంచిన పవన్.. ఇక వారాహి రెండో దశ యాత్రకు సిద్దమౌతున్నట్లు టాక్. అయితే ఈ రెండో దశ యాత్రను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనే దానిపై పవన్ తడబడుతున్నాట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలో మొదటి దశ యాత్ర కొనసాగగా.. రెండో దశను ఉత్తరాంధ్రలో సాగిస్తే ఎలా ఉంటుందని పవన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంకు అధికంగా ఉండడంతో యాత్ర ఇక్కడి నుంచే చేపడితే పార్టీలో లాభం చేకూరే అవకాశం ఉందని భావిస్తున్నారట.

Also Read:ఉడకబెట్టిన శనగలు తినడం మంచిదే.. కానీ!

ఉత్తరాంధ్రలో భాగంగా విశాఖపట్నం, విజయనగరం, వంటి జిల్లాలతో పాటు మరికొన్ని కవర్ చేసే విధంగా రెండో దశ వారాహి యాత్ర ఉండే అవకాశం ఉంది. అన్నీ కుదిరితే ఆగష్టు రెండో వారం నుంచి యాత్ర ప్రారంభించే ఆలోచనలో పవన్ ఉన్నారట. మరి మొదటి యాత్రలో పవన్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ సర్కార్ ను గట్టిగానే ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు రెండో దశ యాత్రలో జగన్ సర్కార్ ను ఇరకాటంలో పెట్టేందుకు ఇంకెలాంటి వ్యూహరచనతో మునుకు సాగుతారో చూడాలి.

Also Read:దిల్‌ రాజు గెలుపు కాదు, పనులు చేయ్

- Advertisement -