కొత్త జంటకు అజ్ఞాతవాసి గిఫ్ట్‌..?

184
Pawan-Trivi Surprise Gift to Chay-Sam?
- Advertisement -

టాలీవుడ్ జంట సమంత చైతూ.. వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 6న వీరి వివాహం జరిగింది..మొదట హిందూ సాంప్రదాయం ప్రకారం.. ఆ తర్వాత క్రైస్తవ ఆచారం ప్రకారం పెళ్లి చేసుకున్న ఈ జంట.. ఇప్పుడు తమ సినిమా పనుల్లో కూడా పడిపోయారు. అయితే.. సరిగ్గా పెళ్లి రోజుకు అందిన ఓ అజ్ఞాత గిఫ్ట్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోయింది.

అజ్ఞాతవాసి అంటే ఎవరా అని అలోచిస్తున్నార.. అది మరెవరో కాదు పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్. అయితే అజ్ఞాతవాసి అనే సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవన్‌ త్రివిక్రమ్‌ రీల్‌ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా మాంచి ఫ్రెండ్స్ వీరిద్దరూ కలిసి.. చైతు-సామ్ లకు సరిగ్గా పెళ్లి సమయానికి అందేలా ఓ కాస్ట్లీ గిఫ్ట్ ను పంపారట.

Pawan-Trivi Surprise Gift to Chay-Sam?

అయితే ఈ పెళ్లికి కుటుంబసభ్యులకు తప్ప వేరే వారికి ఆహ్వానమే లేకపోయినా.. అలాంటివేమీ పట్టించుకోకుండా.. తమ తరఫున ఇద్దరికీ ఖరీదైన డైమండ్ రింగ్స్ ను బహుమతిగా పంపినట్లు తెలుస్తోంది. అందుకునే వరకూ అవేంటో.. ఎవరు పంపారో కూడా తెలియకుండా పంపిన ఈ వజ్రపుటుంగరాలు అందరినీ షాక్ కి గురి చేశాయని తెలుస్తోంది. అయితేఇది రూమర్ మాత్రమే అని కొందరు వాదిస్తున్నారు కానీ.. పవన్‌ త్రివిక్రమ్‌ల మాత్రం నిజమే అంటున్నారు.

- Advertisement -