పిఠాపురంలో పవన్ ప్రత్యర్థి.. టీడీపీనే!

24
- Advertisement -

ఎన్నికలు దగ్గర పడడంతో ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలు వాదోపవాదాలు చేసుకుంటూ పోలిటికల్ హిట్ పెంచుతున్నారు ఆయా పార్టీల నేతలు. తాజాగా పవన్ విషయంలో వైసీపీ చేసిన వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశం అవుతున్నాయి. పిఠాపురంలో పవన్ కు టీడీపీ నుంచే ముప్పు ఉందని, పవన్ ను ఓడించేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించే అవకాశం ఉందని ట్విట్టర్ లో రాసుకొచ్చింది. వైసీపీ ఈ రకమైన కామెంట్స్ చేయడానికి కారణం కూడా లేకపోలేదు. పిఠాపురం టికెట్ మొదట టీడీపీకే వస్తుందని, టీడీపీ తరుపున తానే ఎమ్మెల్యే అభ్యర్థి అని వర్మ మొదటి నుంచి కాన్ఫిడెంట్ కనబరుస్తూ వచ్చారు.

పవన్ కూడా భీమవరం నుంచి పోటీ చేస్తారనే వార్తలు రావడంతో పిఠాపురం టీడీపీకి అల్ మోస్ట్ కన్ఫర్మ్ అనుకున్నారు. కానీ అనూహ్యంగా పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించడంతో ఇక్కడ టీడీపీ త్యాగం చేయక తప్పలేదు, అయితే ఈ సీటు ఆశించిన వర్మ టీడీపీ అధిష్టానంపై కొంత అసంతృప్తి వెళ్లగక్కుతూ వచ్చారు. కానీ చంద్రబాబు బుజ్జగించడంతో కాస్త సైలెంట్ అయి పవన్ గెలుపు కోసం పాటుపడతానని చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా వర్మ చేసిన కామెంట్స్ కొంత చర్చనీయాంశం అవుతున్నాయి. పవన్ ఎంపీ సీటుకు పోటీ చేస్తే పిఠాపురం నుంచి తను బరిలోకి దిగుతానని మరోసారి వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దీంతో పవన్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన తరువాత కూడా వర్మ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడంతో పిఠాపురంలో టీడీపీ వర్గం ఇంకా అసంతృప్తిగానే ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పిఠాపురం సీటును పవన్ ప్రకటించిన తరువాత ఆయనను ఓడించి తీరుతామని టీడీపీలో ఓ వర్గం చెబుతూ వస్తోంది, దీంతో పిఠాపురంలో పవన్ కు టీడీపీనే ప్రధాన శత్రువని వైసీపీ విమర్శిస్తోంది. ఒకవేళ జనసేనకు టీడీపీ మద్దతు కరువైతే పిఠాపురంలో పవన్ గెలుపు కష్టమేనా ? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి పవన్ పిఠాపురంలో ఎలాంటి ఫలితాలను అందుకుంటాడో చూడాలి.

Also Read:సుప్రీంకు క్షమాపణ చెప్పిన పతంజలి..

- Advertisement -