పవన్ అక్కడి నుంచే పోటీ ?

30
- Advertisement -

వచ్చే ఎన్నికలతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తీసుకురావాలని, ఎలాగైనా అధికారంలోకి రావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పట్టుదలతో ఉన్నారు. జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీతో కూడా పొత్తు ప్రకటించారు. ప్రస్తుతం టీడీపీ జనసేన కూటమి వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గట్టి పోటీనిచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం ఇరు పార్టీ నేతల్లో బలంగా ఉంది. ఇక త్వరలోనే సీట్ల కేటాయింపుపై కూడా టీడీపీ, జనసేన కసరత్తులు చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంచితే ఈసారి పవన్ ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం రెండు చోట్ల పోటీ చేసి ఘోర ఓటమిని చవి చూశారు.  .

దాంతో గతంలో జరిగిన పొరపాట్లను మళ్ళీ రిపీట్ చేయకుండా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయ ఢంఖా మోగించాలనే ప్లాన్ లో పవన్ ఉన్నారు. అందులో భాగంగానే ఈసారి ఈసారి కూడా రెండు చోట్ల పోటీ చేసే ఆలోచనలోనే పవన్ ఉన్నారట. తాను గతంలో పోటీ చేసిన భీమవరంతో పాటు ఈసారి కొత్తగా రాయలసీమ నుంచి బరిలోకి దిగితే ఎలా ఉంటుందనే ఆలోచనలో పవన్ ఉన్నట్లు టాక్. భీమవరంలో జనసేన బలంగా ఉంది.

గత ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించినప్పటికి, గతంతో పోల్చితే ఈసారి ఇక్కడ జనసేన పార్టీకే విజయావకాశాలు ఎక్కువ అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక రాయలసీమ విషయానికొస్తే జనసేన చాలా బలహీనంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ పార్టీ బలపడాలంటే స్వయంగా పవన్ రంగంలోకి దిగితే మేలని, అందుకే రాయలసీమలో ఏదో ఒక నియోజిక వర్గం నుంచి పవన్ పోటీ చేయాలని భావిస్తున్నారట. అయితే రాయలసీమలో వైసీపీ ప్రభావం చాలా ఎక్కువ. అసలే జనసేన బలం ఏమాత్రం లేని ఈ ప్రాంతాల్లో పవన్ పోటీ చేసి గెలుస్తారా అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. మరి పవన్ ప్రణాళికలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి.

- Advertisement -