చెల్లెలు కవితకు థాంక్యూ..

252
Pawan Thanks to MP Kavitha
- Advertisement -

జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్.. టీఆర్‌ఎస్ ఎంపీ కవితకు ధన్యవాదాలు తెలిపారు. ‘రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలపై పార్లమెంటులో మాట్లాడిన చెల్లెలు కవిత గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నా’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.ఏపీ ప్రజలకు కవిత మద్దతు ఇవ్వడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు.

విభజన హామీలను అమలు చేయాలని పార్లమెంట్‌లో కవిత డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం ఏపీ ఎంపీలు చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. మిత్రపక్షంగా ఉన్న పార్టీ ఎంపీలే ఆందోళన కార్యక్రమాలను చేపడితే, దేశ ప్రజలకు నెగెటివ్ మెసేజ్ వెళుతుందని… హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ నేపథ్యంలోనే కవితకు పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -