పవన్ టార్గెట్ కింగ్ మేకరా? సి‌ఎం పదవా?

32
- Advertisement -

ఈసారి ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ టార్గెట్ ఏంటి ? ఈ ప్రశ్న ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే టీడీపీ జనసేన పొత్తు తరువాత పవన్ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి ? ఆయన వ్యూహాలు దేనికి సంకేతం ? ఇలాంటి ప్రశ్నలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర డిబేట్లు సాగుతున్నాయి. పార్టీ పెట్టిన మొదటి నుంచి కూడా తనకు పదవులపై ఆశ లేదని ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని మొదట స్లోగన్ వినిపించిన పవన్.. 2019 ఎన్నికల ముందు తన టార్గెట్ పై స్పష్టమైన గురి లేకపోవడంవల్ల ప్రజల్లో కూడా అస్థిర నాయకూడనే ముద్ర పాతుకుపోయింది. కానీ గతంలో చేసిన పొరపాట్లను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎన్నికల కోసం పక్కా వ్యూహరచనతో ముందుకు సాగుతున్నారు. .

2019 ఎన్నికల అనంతరం నిత్యం ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఉంటూ పార్టీని బలోపేతం చేస్తూ వచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో జనసేన పార్టీని క్రియాశీలకంగా మార్చారు. అధికారంలో ఉన్న వైసీపీ కూడా జనసేన పార్టీనే ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తోందంటే అతిశయోక్తి కాదు. కాగా ఇటీవల రాష్ట్రంలో టీడీపీ విషయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను పవన్ అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఎవరు ఊహించని విధంగా టీడీపీతో పొత్తు ప్రకటించి సంచలన రాజకీయానికి తెర తీశారు. అయితే టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకోవడం వెనుక ఉన్న వ్యూహామేంటి అనేదే ఇప్పుడు ఆసక్తికరమైన అంశం.

ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు జైల్లో ఉన్నారు. ఆయన ఎప్పుడు బయటకు వస్తారో కూడా చెప్పలేని పరిస్థితి. ఒకవేళ బయటకు వచ్చినప్పటికి చంద్రబాబుపై ప్రజల్లో సానుభూతి ఏర్పడుతుందా లేదా అవినీతిపరుడనే ముద్రా బలపడుతుందా అనేది చెప్పలేని పరిస్థితి దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి మెజారిటీ సీట్లు సాధిస్తే పవన్ మెయిన్ పాత్రదారిగా మారే అవకాశం ఉంది. సి‌ఎం ఎవరు ఉండాలనే దానిపై ఆయన డెసిషనే ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ఈ మద్య సి‌ఎం పదవే తన టార్గెట్ అని చెబుతూ వస్తున్న పవన్ కుదిరితే ముఖ్యమంత్రిగా తానే ఉండే అవకాశం ఉంది. కానీ టీడీపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటే కింగ్ మేకర్ గా ముఖ్య పాత్ర పోషించే అవకాశం ఉంది. మొత్తానికి టీడీపీ జనసేన కూటమిలో పవనే కీ రోల్ పోషించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది విశ్లేషకులు చెబుతున్నా మాట.

Also Read:Modi:ఆ హామీల సంగతేంటి?

- Advertisement -