ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆహ్వానం లభించింది. బోస్టన్ లోని హార్వర్డ్ యూనివర్సిటీలో ఫిబ్రవరిలో జరగబోయే ‘ఇండియా కాన్ఫరెన్స్ 2017’లో ప్రసంగించే అరుదైన గౌరవం పవన్‌కు దక్కింది. ఫిబ్రవరి 11 నుంచి రెండు రోజుల పాటు సాగే ఈ సమావేశాల్లో పవన్ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ కూడా హాజరు కానున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని‘పవనిజం’ అధికారిక ఫేస్‌బుక్ పేజీలో అభిమానులు ఈ విషయాన్ని పొందుపరిచారు.
దక్షిణాది హీరోల్లో ఇప్పటివరకు కమల్‌హాసన్‌కు మాత్రమే ఈ అరుదైన గౌరవం దక్కింది. అయితే ఇప్పుడు కమల్ తర్వాత ఆ అవకాశం పవన్‌కు రావడంతో ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోతున్నారు.తమ అభిమాన హీరోకు లభించిన ఈ అరుదైన అవకాశంతో సోషల్ మీడియాలో పవన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ట్విట్టర్ లో పవన్ కు అభినందనల వెల్లువ సాగుతోంది. ఇందులో పవన్ సమజ సమస్యల మీద..పాలకులు చెపట్టాల్సిన చర్యలపై మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జనసేన పార్టీతో సమస్యలపై పోరాడుతున్న విషయం తెలిసిందే.
#IndiaConference2017 is a student-run conference held at Harvard University, and #PawanKalyan will either speak on Feb 11 or 12.
— Haricharan Pudipeddi (@pudiharicharan) January 16, 2017