ఏపీలో జనసేన పార్టీ టీడీపీ మరియు బీజేపీతో పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించే లక్ష్యంతో ఈ పొత్తును కొంసాగిస్తున్నారు అధినేత పవన్ కల్యాణ్. అయితే బీజేపీతో పొత్తు ను పవన్ లైట్ తీసుకుంటున్నప్పటికీ టీడీపీతో మాత్రం పొత్తును పక్కా ప్రణాళిక బద్దంగా కొనసాగిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించాలంటే టీడీపీకి జనసేన అవసరత చాలానే ఉంది. గతంతో పోల్చితే జనసేన పార్టీ బలం పెంచుకోవడంతో ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటు శాతం కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జనసేన టీడీపీకి తొడవ్వడం వల్ల వైసీపీకి గట్టిగానే పోటీనిచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే టీడీపీ జనసేన కూటమి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.
అయితే ఈ రెండు పార్టీల మద్య సీట్ల కేటాయింపు సిఎం అభ్యర్థి వంటి అంశాలపై ఇంకా ఎలాంటి క్లారిటీ రానప్పటికి అంతిమంగా ఎవరిది పైచేయి అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. ఇదిలా ఉండగా తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడిని మరింత పెంచుతున్నాయి. మరో పదేళ్ళు టీడీపీతో పొత్తు కొనసాగుతుందని ఆయన చెప్పడం ఆసక్తికర అంశం. అంటే 2024 ఎన్నికలతో పాటు 2029 ఎన్నికల్లో కూడా టీడీపీతో దోస్తీ కొనసాగించాలని పవన్ డిసైడ్ తెలుస్తోంది.
అయితే ఇలా పదేళ్ళు టీడీపీతో పొత్తు కొనసాగించడం వెనుక పవన్ వ్యూహామెంటి అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అధికారం సాధించేంత బలం జనసేన పార్టీకి లేదనేది అందరికీ తెలిసిన విషయం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జనసేన ఎంతవరకు ప్రభావం చూపుతుందనేది ప్రశ్నార్థకమే. అందుకే వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి వచ్చే ఫలితాల ఆధారంగా పొత్తు కొనసాగించాలనేది పవన్ ప్లాన్ గా తెలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనసేన పార్టీ సొంతంగా ప్రభుత్వం స్థాపించే సీట్లు కైవసం చేసుకున్నప్పుడే సింగిల్ గా ఎన్నికల బరిలో దిగే సాహసం పవన్ చేస్తారని రాజకీయవాదులు అభిప్రాయ పడుతున్నారు. అందుకే మరో పదేళ్ళు టీడీపీతో పొత్తులో ఉండేందుకే పవన్ ఆలోచిస్తున్నట్లు టాక్.
Also Read:సూర్య విధ్వంసం.. సిరీస్ సమం!