మురళీ నాయక్ త్యాగం మర్చిపోం:పవన్

13
- Advertisement -

జమ్మూ సరిహద్దులో శత్రు మూకలతో పోరాడి వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ త్యాగాన్ని దేశం ఎప్పుడూ మర్చిపోదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.

మురళీ నాయక్ వీరమరణం పొందినది గర్వకారణం… ఆయన చేసిన త్యాగం దేశం ఎప్పటికీ మర్చిపోలేదు. శత్రు సరిహద్దుల్లో పోరాడుతూ తమ ప్రాణాలను అంకితం చేయడం ఎంత గొప్పదో, అట్టి సైనికుల సేవలను ఎప్పటికీ గుర్తించాలి అని తెలిపారు.

జవాన్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మీరు చేసిన త్యాగం మరచిపోలేరు. రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటుందని నమ్మకంతో చెప్తున్నాను అని భరోసా ఇచ్చారు.

Also Read:చిరు 157..మూవీ అప్‌డేట్!

- Advertisement -