Pawan:ఓజి రిలీజ్ డేట్ ఛేంజ్‌!

47
- Advertisement -

సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఓజీ. ఇప్పటికే మెజార్టీ షూటింగ్‌ కంప్లీట్ కాగా తొలుత డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం రిలీజ్ డేట్ మారినట్లు తెలుస్తోంది.

తొలుత డిసెంబర్‌లో రిలీజ్ చేయాలని భావించారు. కానీ అది సాధ్యపడేలా కనిపించడం లేదు. దీంతో రిలీజ్‌ డేట్‌ని పోస్ట్ పోన్ చేసే ప్లాన్‌లో ఉన్నారట మేకర్స్‌. ఇందులో భాగంగా వచ్చే ఏడాది వేసవి కానుకగా సినిమాని రిలీజ్ చేయనున్నారని సమాచారం. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా డివివి ఎంటర్‌టైన్మెంట్స్‌ నిర్మిస్తోంది.

Also Read:BRO:థీమ్ ఆఫ్ బ్రో లిరికల్ వీడియో

ఇక ఈ సినిమా ఓవర్సీస్ డీల్‌ కూడా భారీ ఎత్తున జరిగింది. ఓజిని ఏకంగా 18 కోట్ల మాసివ్ డీల్ తో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ దక్కించుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ భారీ చిత్రంలో అర్జున్ దాస్, శ్రేయ రెడ్డి, ఇమ్రాన్ హష్మీ లాంటి బిగ్గెస్ట్ స్టార్స్ నటిస్తున్నారు.

Also Read:Kanguva:క్రేజీ అప్‌డేట్

- Advertisement -