తెలంగాణలో పోటికి జనసేన దూరం..!

235
Pawan Kalyan
- Advertisement -

తెలంగాణలో ఎన్నికల వాతావరణం హిటెక్కింది. ప్రధాన పార్టీలన్ని ఎన్నికల కదనరంగంలో సత్తాచాటేందుకు వ్యుహాలు రచిస్తున్నాయి. టీఆర్ఎస్ ఒంటరిగా బరిలోకి దిగితే కాంగ్రెస్,టీడీపీ,సీపీఐ,టీజేఎస్ మహాకూటమిగా ప్రజల ముందుకువస్తున్నాయి. సీపీఎం(బహుజన లెఫ్ట్ ఫ్రంట్),బీజేపీ కూడా ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ జనసేన పోటీ చేస్తుందా లేదా అన్న సందేహం అందరిలో నెలకొంది.

అయితే నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా..ఇడా ఉంటా అంటూ ప్రకటించిన పవన్ కల్యాణ్ తన మనసు మార్చుకున్నట్లున్నారు.   ఇటీవల కొండగట్టులో పర్యటించిన పవన్‌ తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. దీంతో ఆశావాహులు అంతా జనసేన కార్యాలయాలకు క్యూ కట్టారు. మరికొంతమంది పవన్ సన్నిహితుల ద్వారా టికెట్ పొందేందుకు ప్రయత్నాలు చేశారు.

కానీ సీన్ కట్ చేస్తే. జనసేన నుంచి పోటీ చేసే ఆశావాహులకు పవన్ షాక్ ఇచ్చినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. ప్రస్తుతం ఏపీ రాజకీయాలపై పూర్తి స్ధాయిలో ఫోకస్ పెట్టిన పవన్‌ తెలంగాణలో పోటీ చేయడకూదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తెలంగాణ నేతల ముందు పవన్ ప్రస్తావించారు.

పవన్ నిర్ణయం వెనుక వ్యూహాత్మక ఎత్తుగడలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణ పార్టీ నిర్మాణం ఇంతవరకు జరగలేదు. కనీసం పూర్తి స్ధాయిలో కమిటీల నియామకం కూడా జరగలేదు. ఈ క్రమంలో పోటీకి దిగి మిశ్రమ ఫలితాలు పొందడం కంటే పోటికి దూరంగా ఉండటమే మేలని పవన్ భావిస్తున్నారట.

ఈసీ ప్రకటన తర్వాత తెలంగాణ ఎన్నికల్లో 25 స్థానాల్లో పోటీ చేయాలనుకున్నాం, కాకపోతే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో నిర్ణయాన్ని మార్చుకున్నాం అని పవన్ త‌న సన్నిహితులతో అన్న‌ట్టు తెలుస్తోంది. ఆ పార్టీ నేతలు కూడా బలం లేనప్పుడు కొన్ని స్ధానాల్లో కూడా పోటీ చేయడం కంటూ దూరంగా ఉండటమే మంచిదనే పవన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారట. ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తంగా జనసేన నుంచి అధికారిక ప్రకటన వెలువడితే తప్ప అసలు జనసేన పోటీ చేస్తుందా లేదా అన్న పుకార్లకు బ్రేక్ పడేలా కనిపించడం లేదు.

- Advertisement -