ఎన్నికలకు పవన్ దూరం..నిజమేనా?

28
- Advertisement -

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండనున్నారా ? అంటే అవుననే గుసగుసలు ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఎంతో సమయం లేదు ఏప్రిల్ లేదా మే మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈసారి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలనే పట్టుదల కనబరుస్తూ వచ్చారు. అందుకే పార్టీనీ క్షేత్ర స్థాయిలో బలపరుస్తూ టీడీపీతో కూడా పొత్తు పెట్టుకున్నారు. ఇప్పటికే తొలి జాబితాలో 24 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్ సభ స్థానాలను ప్రకటించారు కూడా. అయితే తొలి జాబితాలో అధినేత పవన్ పేరు లేకపోవడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. .

అయితే రెండో జాబితాలో పేరు ఉంటుందని, ఈసారి పవన్ అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయమని జనసైనికులు ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. కానీ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం అసలు అసెంబ్లీ ఎన్నికల బరిలోనే పవన్ ఉండరని తెలుస్తోంది. బీజేపీతో పొత్తు నిమిత్తం తాజాగా పవన్ చంద్రభాబు ఇటీవల డిల్లీ వెళ్ళిన సంగతి తెలిసిందే. అక్కడ కమలం పార్టీ పెద్దలు పవన్ కు కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేసినట్లు టాక్. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో పవన్ పోటీ చేసేందుకు సిద్దమైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

పైగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసిన పవన్.. ఆ ఓటమి కారణంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే సేఫ్ సైడ్ గా లోక్ సభ ఎన్నికల్లో నరసాపురం సీటు నుంచి పోటీ చేసేందుకు పవన్ మొగ్గు చూపుతున్నారట. అయితే రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ఈ వార్తలపై ఎంతవరకు స్పష్టత ఉందో తెలియదు గాని.. ఈ అంశం అటు జనసైనికులను ఇటు ప్రజలను గందరగోళానికి గురి చేస్తోంది. మరి పవన్ దారెటు అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.

Also Read:Rajamouli: మహేష్ కోసం రాజమౌళి రిస్క్?

- Advertisement -