ప‌వ‌న్ న్యూ లుక్ వైర‌ల్‌..

711
pawan
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ రెండు సినిమాలు కూడా సెట్స్‌పైకి వెళ్లిపోయాయి. అందులో ఒక సినిమా ‘వకీల్ సాబ్’ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. మరోవైపు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో చేస్తోన్న సినిమా కూడా షూటింగ్ జరుపుకుంటోంది. క్రిష్- ప‌వ‌న్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ఈ మూవీ పీరియాడిక‌ల్ డ్రామా అని తెలుస్తోంది.

తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి సంబంధించిన ఓ లుక్ సోష‌ల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఇందులో ప‌వ‌న్ నుదుటిన పొడ‌వాటి ఎర్ర‌బొట్టు పెట్టుకొని తీక్ష‌ణంగా చూస్తున్నారు. ఈ ఫోటో చూస్తుంటే మాత్రం క్రిష్ తెర‌కెక్కిస్తున్న చిత్రం పీరియాడిక్ డ్రామాగానే అర్ధ‌మ‌వుతుంద‌ని నెటిజ‌న్స్ అంటున్నారు. ఇందులో క‌థానాయిక ఎవ‌రు, చిత్ర రిలీజ్ ఎప్పుడు త‌దిత‌ర వివ‌రాల‌ని త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు. ఎ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

pawan new look

- Advertisement -