ప్రగతిభవన్‌కు తొలిసారి జనసేనాని

149
Pawan meets KCR
- Advertisement -

జ‌న‌సేన అధ్య‌క్షుడు, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ హైద‌రాబాద్‌లోని ముఖ్య‌మంత్రి కేసీఆర్ నివాస‌మైన ప్ర‌గ‌తిభ‌వ‌న్‌కు వ‌చ్చారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో కేసీఆర్‌ను క‌లిసిన ఆయ‌న.. కాసేపు ముచ్చ‌టించారు. నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపి ప‌లు అంశాల‌పై ప‌వ‌న్ చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. ప‌వ‌న్ మొద‌టిసారి ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వ‌చ్చారు. పవన్ రాకతో సందడి వాతావరణం నెలకొంది.

నూతన సంవత్సరం సందర్భంగా ప్రగతి భవన్ లో మంత్రులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు సీఎంను కలిసి శుభాకాంక్షలు చెప్పారు. టీఆర్ఎస్ కార్యకర్తలు, అధికారులు,. ప్రజాసంఘాలు, కవులు కళాకారులు…. తనను కలిసిన అందరినీ ఆప్యాయంగా పలకరించారు సీఎం. అందిరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు .

ఇటీవల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శీతాకాల పర్యటనలో రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ రాష్ట్రపతికి విందు ఇవ్వగా ఈ విందులో సైతం కేసీఆర్,పవన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. వీరిద్దరు కాసేపు ప్రత్యేకంగా మాట్లాడుకోగా తాజాగా ప్రగతిభవన్‌లో పవన్‌…సీఎం కేసీఆర్‌ని కలవడం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -