మెగా ఫ్యాన్స్ ఖుష్ … చిరుతో పవన్ భేటీ

80
Pawan Meets Chiru

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌. మెగాస్టార్ చిరంజీవితో ఆయన సోదరుడు,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రహస్యంగా భేటీ అయ్యారు. చాలా రోజుల తర్వాత వీరిద్దరు భేటీ కావటంపై సర్వత్ర చర్చనీయాంశమైంది. చిరంజీవి ఇంటికి వెళ్లి మరీ ఖైదీ నెంబర్‌ 150 సినిమా విజయంపై పవన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరూ పలు అంశాలపై మాట్లాడుకున్నట్లు సమాచారం.

చిరంజీవి నటించిన ఖైదీనెం.150 ప్రీ రిలీజ్ వేడుకకు కళ్యాణ్‌ హాజరు కాలేదు. దీంతో రకరకాల వార్తలు వెలువడ్డాయి. దీంతో స్పందించిన పవన్ అన్నయ్య సినిమా విజయవంతం కావాలని ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. ఇక తాజాగా గురువారం చిరు ఇంటికి వెళ్లిన పవన్ కాసేపు అక్కడే ఉన్నారు.

ఖైదీ అందించిన విజయంతో అటు, మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఖైదీ నంబర్‌ 150 వారం రోజులకే రూ.108 కోట్ల 48 లక్షల గ్రాస్‌ను వసూలు చేసింది. వేగంగా అంత మొత్తాన్ని వసూలు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది.