చిరుకు పవన్ పాదాభివందనం

16
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవిని కలిశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఏపీలో జనసేన అఖండ విజయం సాధించిన తర్వాత అన్నయ్య చిరును కలిసేందుకు కుటుంబ సమేతంగా ఆయన ఇంటికి చేరుకున్నారు పవన్.

తన భార్య అన్నా లెజనోవా, తనయుడు అకిరా నందన్ తో కలిసి చిరును కలిశారు. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ అంతా పూలు జల్లి స్వాగతం తెలిపారు. అన్నయ్యను చూడగానే పవన్ చిరంజీవి కాళ్లకు నమస్కరించాడు. చిరంజీవి ఆనందభాష్పాలతో పవన్ ని హత్తుకున్నాడు. అనంతరం చిరంజీవి భార్య సురేఖ పవన్ కి, అకిరాకు, అన్నా లేజనోవాకు బొట్టు పెట్టి హారతి ఇచ్చింది. పవన్ తన తల్లి అంజనా దేవిని హత్తుకున్నారు. చిరంజీవి పవన్ కు పెద్ద గజమాల వేసి పూల గుచ్చం ఇచ్చి స్వాగతం తెలిపారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Also Read:డయాబెటిస్‌తో బాధపడేవారికి చిట్కాలు….

- Advertisement -