టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా..సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. తాజాగా మహేష్ బాబుకు పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కథానాయకుడిగా మహేష్ బాబు అందుకున్న ఘన విజయాలు చిత్రపరిశ్రమ వృద్ధికి దోహదపడ్డాయని పవన్ అన్నారు. అలాగే మాహేష్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన వారి లిస్ట్ లో కేటీఆర్ కూడా ఉన్నారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు బ్రో అంటూ మంత్రి కేటీఆర్ మహేష్ బాబుకు బర్త్ డే విషెస్ ను ట్వీట్టర్ ద్వారా తెలియజేశారు.
రియల్ లైఫ్‌లోనూ మహేష్ సూపర్ స్టారే. కృష్ణా కుమారుడిగా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు టాలీవుడ్‌లోనే అగ్ర హీరోగా కొనసాగుతున్నారు ఈ సూపర్ స్టార్. వెండితెరపైనే కాదు అటు రియల్ లైఫ్‌లోనూ మహేష్ హీరోనే. ఎన్నో సేవా కార్యక్రమాలు చెపడుతూ ప్రజలకు తనవంతు సహాయం చేస్తుంటారు. అటు 1000 మందికి పైగా చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ చేయించి ప్రాణదానం చేశారు.
Also Read:రేవంత్ ఏ పార్టీ లో ఉన్నా ఆ పార్టీ ఖతమే..
మహేష్ బాబు 1975 ఆగస్టు 9న చెన్నైలో హీరో కృష్ణ, ఇందిర దంపతులకు జన్మించారు. కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్, కొద్దికాలంలోనే తనదైన స్టైల్‌తో యూత్ ఫేవరెట్ హీరోగా మారారు. సింపుల్ స్మైల్‌తో అమ్మాయిల మనసు దోచేసుకున్నారు. తన నటనకు 7 నంది అవార్డులు కూడా అందుకున్నారు. ప్రస్తుతం మహేశ్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తోన్న గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు.
Also Read:పచ్చి అరటికాయ తింటే ఎన్ని ప్రయోజనాలో..!