ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ప్రభుత్వ విపక్ష పార్టీల మద్య జరుగుతున్నా రాజకీయ చదరంగం ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. ముఖ్యంగా టీడీపీ, జనసేన టార్గెట్ గా వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు కొత్త చర్చలకు తవిస్తున్నాయి. ఇక తాజాగా మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు.. టీడీపీ జనసేన దోస్తీని మరోసారి తెరపైకి తీసుకొచ్చాయి. అంబటి మాట్లాడుతూ.. పవన్ మరియు లోకేశ్ లకు నిబద్దత లేదని చెప్పుకొచ్చారు. లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రతో టీడీపీ మరింత పతనం అవ్వడం ఖాయమని, తెలుగు మాట్లాడలేని లోకేశ్ టీడీపీ వారసుడా ? అంటూ ఎద్దేవా చేశారు అంబటి. .
ఇదే సందర్భంలో పవన్ వారాహిని ఉద్దేశించి మాట్లాడుతూ.. లోకేశ్ పాదయాత్ర కోసమే వారాహి ఆగింది అంటూ కొత్త చర్చకు తవిచ్చారు. టీడీపీ జనసేన మద్య పొత్తును పదే పదే విమర్శగా వైసీపీ నేతలు వాడుతున్నప్పటికి, టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు విషయంపై ఆచితూచి స్పందిస్తున్నాయి. అయితే లోకేశ్ పాదయాత్ర కోసమే పవన్ తన బస్సుయాత్రను వాయిదా వేసుకున్నారా ? అంటే సమాధానం చెప్పడం కష్టమే. లోకేశ్ పాదయాత్ర కంటే ముందే పవన్ బస్సుయాత్రను అనౌన్స్ చేశారు. అయినప్పటికి ఇంతవరకు పవన్ బస్సు యాత్ర కార్యరూపం దాల్చలేదు. గత ఏడాది దసరా సందర్భంగానే పవన్ బస్సు యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది.
కానీ ఊహించని రీతిలో బస్సు యాత్రను వాయిదా వేసుకున్నారు. ఇక ఆ తరువాత బస్సు యాత్రకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు పవన్. ఇక ఇటీవల తన బస్సు యాత్రకు సంబంధించిన వాహనం వారాహిని పరిచయం చేశారు గాని, యాత్ర ప్రారంభానికి సంబంధించిన సమాచారం మాత్రం ఇవ్వలేదు. మరోవైపు గతనెలలో లోకేశ్ పాదయాత్రను ప్రారంభించి నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ లోకేశ్ కోసమే తన బస్సు యాత్రను వాయిదా వేసుకున్నారా ? అన్న సందేహాలు పోలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తమౌతున్నాయి. టీడీపీ జనసేన మద్య పొత్తు బహిరంగంగా ప్రకటించకపోయినప్పటికి.. ఇంటర్నల్ గా దోస్తీ కొనసాగుతోందని, అందుకే పవన్ తన యాత్రను వాయిదా వేసుకున్నారని వైసీపీ నేతల నుంచి వినిపిస్తున్న విమర్శ. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే పవన్ క్లారిటీ ఇవ్వాల్సిందే.
ఇవి కూడా చదవండి..