సంక్రాంతి బరిలోకి ‘భీమ్లా నాయక్’.. మేకింగ్‌ వీడియో..

189

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి హీరోలుగా ‘#PSPKRana’ వర్కింగ్ టైటిల్ తో ఓ మల్టీస్టారర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇది మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కొశీయున్’ చిత్రాన్ని అధికారిక తెలుగు రీమేక్. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందిస్తున్నారు. సోమవారం ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ‘భీమ్లా నాయక్’ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కనిపించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియో రిలీజ్ చేస్తూ.. బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఆఫీసియల్‌గా ప్రకటించారు.

తాజాగా విడుదలైన ఈ మేకింగ్ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే విడుదలైన పవన్ స్టిల్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. పరశురామ కృష్ణమూర్తి అనే టైటిల్‌ను ఈ సినిమా కోసం ఆలోచిస్తున్నారు దర్శక నిర్మాతలు. కాగా ఈ చిత్రంలో పవన్ సరసన నిత్యామీనన్.. రానా కు జోడీగా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.12 గా ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది. నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

#BheemlaNayak - Making Glimpse | Pawan Kalyan | Rana Daggubati | Saagar K Chandra | Trivikram