బాలయ్యతో పవన్?

5
- Advertisement -

టాలీవుడ్‌లో మరో మల్టీస్టారర్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే వెండితెరపై పలు క్రేజీ కాంబినేషన్‌లు రాగా తాజాగా నందమూరి నటసింహం బాలకృష్ణ, పవర్ స్టార్‌ ఒకే మూవీలో కనిపించబోతున్నట్లు టీ టౌన్‌లో వార్త చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం బాలయ్య అఖండ-2 సీక్వెల్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ గెస్ట్ రోల్‌లో నటించనున్నారట. సినిమాలో బాలయ్య దేవాలయాల పవిత్రతను కాపాడే పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది. అంతేకాదు హిందూ గ్రంధాల జోలికి వచ్చి.. వాటిని అవహేళన చేసేవారి పని పడతాడట. ఇందులో పవన్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా బాలయ్యతో కలసి నటించబోతున్నాడని అంటున్నారు.

పవన్ కల్యాణ్‌.. బాలయ్య ఇద్దరు ఇంటర్వెల్ టైమ్‌లో ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తారని ఆ సీన్‌ వేరే లెవల్‌లో ఉంటుందని చెబుతున్నారు. బాలయ్య, పవన్‌ ఒకే సీన్‌లో కనిపించే టైమ్‌లో వచ్చే bgmకు థియేటర్స్‌ దద్దరిల్లిపోవడం ఖాయమంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ అఫిషియల్ అనౌన్స్‌మెంట్‌ రావాల్సి ఉంది.

Also Read:జీర్ణ సమస్యలకు చెక్ పెట్టండిలా!

- Advertisement -