ఓటీటీలో వకీల్ సాబ్…ఎప్పుడో తెలుసా..!

237
Vakeel Saab
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వకీల్ సాబ్. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా ఇప్పటి వరకు 85 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది.

తాజాగా పవన్ ఫ్యాన్స్‌కు సర్ ప్రైజ్ ఇచ్చారు దర్శక నిర్మాతలు. ఏప్రిల్ 30న వకీల్ సాబ్ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని అమెజాన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

బయట పరిస్థితులు కూడా బాగోలేకపోవడంతో ఈ సినిమాను అనుకున్న దానికంటే ముందుగానే ఓటిటిలో విడుదల చేస్తున్నారు. ఏదేమైనా కూడా అభిమానులకు ఇది నిజంగానే తీపికబురు.

- Advertisement -