ముగిసిన ఎన్నికల ప్రచారం..

255
dayakar
- Advertisement -

ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ లతోపాటు మరో 5 మున్సిపాలిటీ లలో ఎన్నికల ప్రచారం ముగిసింది.ఖమ్మం 60 సీట్లకు గాను ఒక్క సిటు ఏకగ్రీవం మిగతా 59 సీట్లకు ఎన్నికలు జరగనుండగా 251 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.అచ్చం పెట్ 20 సీట్లకు గాను బరిలో 66 మంది అభ్యర్థులు,సిద్దిపేట 43 సీట్లకు గాను బరిలో 236 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

నకిరేకల్ 20 సీట్లకు గాను బరిలో 93 మంది అభ్యర్థులు,జడ్చర్ల 27 సీట్లకు గాను బరిలో 112 మంది అభ్యర్థులు,కొత్తూరు 12 గాను బరిలో 47 మంది అభ్యర్థులు,వరంగల్ 66 సీట్లకు బరిలో 502 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.ఈ నెల 30న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

80 యేండ్ల పైబడిన వృద్ధులకు, కరోనా పాజిటివ్ వచ్చిన వారికి, దివ్యంగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం.లాస్ట్ గంటలో కరోనా పాజిటివ్ ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పించారు.800-1000 కి ఒక్క పోలింగ్ కేంద్రం.కరోనా నిబంధనలు పాటిస్తూ పోలింగ్ నిర్వహించగా మే 3 న ఓట్ల లెక్కింపు జరగనుంది.ఎన్నికల ఫలితాల అనంతరం కరోనా నేపథ్యంలో విజయోత్సవ ర్యాలీలు నిషేదించింది ఈసీ.

- Advertisement -