పవన్…..వకీల్ సాబ్ సెన్సార్ పూర్తి

172
vakeel saab
- Advertisement -

పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ ప్రధానపాత్రలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. బాలీవుడ్ హిట్ చిత్రం ‘పింక్’ కు రీమేక్ గా రూపుదిద్దుకుంటున్న ‘వకీల్ సాబ్’ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌లో డైలాగ్‌లతో ఆకట్టుకున్నారు పవన్.

తాజాగా ‘వకీల్​సాబ్’​ సెన్సార్​ పూర్తి చేసుకుని, యూ/ఏ సర్టిఫికెట్​ సొంతం చేసుకుంది. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమా పైన భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.సెన్సార్ టాక్ అయితే వకీల్ సాబ్‌కు చాలా బాగా వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ‘పింక్’ సినిమాలో దాదాపుగా ఫైట్స్ ఉండవు కానీ ‘వకీల్ సాబ్’లో మొత్తం 5 యాక్షన్ సీక్వెన్సులు ఉండబోతున్నట్లు సెన్సార్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం.

- Advertisement -