జీఎస్టీ భారం తగ్గింపు..పేదలకు ఊరట

9
- Advertisement -

జీఎస్టీ స్లాబ్ సవరణను స్వాగతిస్తూ ఎక్స్ లో పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు. జీఎస్టీ భారం తగ్గించిన ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జీఎస్టీ కౌన్సిల్ కు ధన్యవాదాలు తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం. ఈ సంస్కరణలు అసంఖ్యాక కుటుంబాలకు మేలు చేస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పారు.

ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్రం నుంచి జీఎస్టీ సడలింపులు – పేదలు, మధ్యతరగతి, రైతులకు ఊరట అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ఇచ్చిన హామీని నెరవేర్చుతూ, ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ భారం తగ్గిస్తూ నూతన తరహా సంస్కరణలను తీసుకొచ్చింది అన్నారు.

ప్రత్యేకంగా పేదలు, మధ్యతరగతి వర్గాలు, రైతులు, ఆరోగ్యరంగానికి గణనీయమైన ఉపశమనం లభించింది. ప్రాణాలను కాపాడే, భవిష్యత్తును బలోపేతం చేసే విద్య, ఇన్సూరెన్స్‌పై జీఎస్టీని పూర్తిగా తొలగించడం విశేషంగా నిలిచింది. ఈ సంస్కరణలు లక్షలాది కుటుంబాల కష్టాలను తగ్గించనున్నాయి. ప్రజల సంక్షేమాన్ని కేంద్రబిందువుగా ఉంచి ఈ సంస్కరణలను అమలు చేసినందుకు నిర్మల సీతారామన్‌, జీఎస్టీ కౌన్సిల్‌కి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు పవన్‌.

 

Also Read:అబ్బురపరిచేలా..‘మదరాసి’

- Advertisement -