ఏపీ రాజకీయాల్లో వాలెంటర్ల అంశం తీవ్ర చర్చనీయంశం అవుతోంది. వాలెంటర్ల ప్రజల వ్యక్తిగత డేటా సేకరిస్తున్నారని, అలా చేయడానికి వాలెంటర్లకు ఎవరు అధికారం ఇచ్చారని ఇటీవల జనసేన అధినేత పవన్ ఘాటైన వ్యాఖ్యలు చేసి ఒక్కసారిగా పోలిటికల్ హీట్ పెంచారు. ప్రస్తుతం వాలెంటరీ వ్యవస్థ ప్రభుత్వ కార్యకలాపాలలో కీలకపాత్ర పోషిస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నీ పథకాలు వాలెంటర్ల ద్వారానే ప్రజలకు చేరుతున్నాయి. అయితే మొదటి నుంచి కూడా వాలెంటరీ వ్యవస్థపై కొంత వ్యతిరేకత వ్యక్తమౌతూనే ఉంది. వాలెంటర్లు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని, జగన్ వాలెంటరీ వ్యవస్థను స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నాడని ఇలా రకరకాల వార్తలు వినిపించాయి..
ఇదిలా సాగుతుండగానే వాలెంటర్లు ప్రజల డేటా చోరీకి పాల్పడుతున్నారని పవన్ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చి.. దీనిని బలంగా ప్రజల్లోకి తీసుకెల్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పవన్ వ్యాఖ్యలకు చెక్ పెట్టేందుకు వైసీపీ కూడా ఘాటుగానే రియాక్ట్ అవుతోంది. ఇదిలా ఉంచితే తాజాగా పవన్ కల్యాణ్ వాలెంటరీ వ్యవస్థపై ట్విట్టర్ వేదికగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల వ్యక్తిగత డేటా తీసునే హక్కు ఎవరిచ్చారని ఓ సామాన్యుడు వాలెంటరీని నిలదీస్తున్నా వీడియోను పోస్టు చేస్తూ.. డేటా సేకరణపై వైసీపీ స్పస్టతనివ్వాలని, ప్రజల ప్రైవేట్ డేటా కలెక్ట్ చేయమని ఎవరు ఆదేశాలిస్తున్నారని, అసలు ఈ వాలెంటరీ వ్యవస్థకు ఎవరు బాసు అంటూ ట్వీట్ చేశారు. వాలెంటరీ వ్యవస్థపై ప్రశ్నిస్తున్నందుకు తనను జైలుకు పంపేందుకు జగన్ సిద్దమౌతున్నారని.. తనను ఏం చిసిన వెనక్కి తగ్గబోనంటూ పవన్ వ్యాఖ్యానించారు. మొత్తానికి వాలెంటరీ వ్యవస్థపై పవన్ చేస్తున్న వ్యాఖ్యలకు వైసీపీ నుంచి సరైన సమాధానం లేకపోవడంతో ఈ పరిణామాలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి.
Also Read:మహేష్ రెమ్యూనరేషన్ పై పుకార్లు