పవన్ సరసన నిత్యామీనన్!

187
nithya menen
- Advertisement -

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. బీమ్లానాయక్‌ తిరిగి డ్యూటీలో చేరాడు అనే పోస్టర్‌ని విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది.

తాజాగా ఈ సినిమాలో పవన్‌కు జంటగా నిత్యా మీనన్ నటిస్తుండగా రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. షూటింగులో నిత్యామీనన్ జాయిన్ అయిందని ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ ఆమెకి వెల్ కమ్ చెప్పింది చిత్రయూనిట్. ఈ రోజు నుంచి పవన్ – నిత్యామీనన్ కాంబినేషన్ సీన్స్ ను చిత్రీకరించనున్నారు. త్వరలోనే ఐశ్వర్య రాజేశ్ కూడా షూటింగులో జాయిన్ కానున్నట్టు తెలుస్తోంది. పవన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను, 2022 సంక్రాంతికి సినిమా రిలీజ్ కానుంది.

- Advertisement -