ఆటాడిస్తా.. కాచుకో!

28
- Advertisement -

ఏపీలో జనసేన వైసీపీ మద్య రాజకీయాలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఈ రెండు పార్టీల మద్య విమర్శలు ఆరోపణలు తారస్థాయికి చేరుతున్నాయి. జనసేన అధినేత పవన్ తన రాజకీయ ప్రసంగాల్లో ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేసిన వాటికి కౌంటర్ ఎటాక్ ప్రారంభించడం వైసీపీ నేతలకు పరిపాటిగా మారింది. అలాగే జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంలో పవన్ ఈ మద్య మరీటా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఏపీ రాజకీయాలు జనసేన వర్సస్ వైసీపీగా మారాయి. తాజాగా వారాహి మూడో దశ యాత్రను విశాఖపట్నంలో ప్రారంభించిన పవన్.. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఏపీ పోలిటికల్ సర్కిల్స్ లో అగ్గి రాజేస్తున్నాయి. .

సహజ వనరులను వైసీపీ నేతలు దోచేస్తున్నారని, వారియొక్క భవిష్యత్ చివరి దశకు వచ్చిందని తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు పవన్. విశాఖ జగన్ చేస్తున్న అక్రమాలపై కేంద్రం కూడా నిఘా ఉంచిందని, కేంద్రంతో జగన్ ను ఒక ఆట ఆడిస్తానని పవన్ తనదైనా రీతిలో పంచులు కురిపించారు. కేంద్రం ఇచ్చిన నిధులతో పనులు చేస్తూ జగన్ తన బొమ్మ వేసుకుంటున్నాడని, విశాఖలో 25 వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టారని తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు పవన్.

Also Read:ఇదేనా బీజేపీ సమన్యాయం?

ప్రస్తుతం పవన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే బీజేపీతో పవన్ పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా జగన్ పై పవన్ అవినీతి అస్త్రాలను సంధించి ఇరుకున పెట్టె ప్లాన్ లో అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. గత కొన్నాళ్లుగా విశాఖ రిషికొండ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు జగన్ సర్కార్ కన్నేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఇంకా పలు అంశాలపై కేంద్రం జగన్ సర్కార్ పై కొంత గుర్రుగానే ఉంది. ఈ నేపథ్యంలో పవన్ చొరవతో జగన్ పై కేంద్ర దర్యాప్తు సంస్థలు రైడ్ లు జరిపిన ఆశ్చర్యం లేదనే టాక్ వినిపిస్తోంది. మరి ముందు రోజుల్లో పవన్ వర్సస్ జగన్ మద్య పోరు ఎలా ఉండబోతుందో చూడాలి.

Also Read:బండి సంజయ్ రాజీనామాకు సిద్దమా?

- Advertisement -