ఈ సినిమా చేయడం నా అదృష్టం- పవర్ స్టార్

148
- Advertisement -

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్ ప్రస్తుతం న‌టించిన చిత్రం ‘వ‌కీల్ సాబ్‌’. ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌కుడు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 9న విడుద‌ల కానున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను చిత్రయూనిట్ హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ వేడుకలో ఈ సినిమా చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని పవన్ కల్యాణ్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక మహోన్నత స్థానానికి వెళ్లి, అద్భుతమైన విజయాలు సాధించిన దిల్ రాజుగారి లాంటి వ్యక్తితో.. వకీల్ సాబ్ వంటి చిత్రాన్ని చేసినందుకు.. నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నా కోసం సినిమాలు చేయమని నేను ఎవరిని యాచించలేను. అది నా దురదృష్టం. ఇందాక వేణు శ్రీరామ్ మాట్లాడుతూ తను ఒక టైలర్ కొడుకును అని అన్నారు. నా తండ్రి కూడా ఓ సాధారణమైన పోలీస్ కానిస్టేబుల్. అలాంటి స్థాయి నుంచి వచ్చిన నా దృష్టిలో ఏ వృత్తి ఎక్కువ కాదు .. ఏ వృత్తి తక్కువా కాదు. వేణు శ్రీరామ్ కి నేను అవకాశం ఇవ్వలేదు. తను ఎంతో కష్టపడి స్వశక్తితో ఈ అవకాశాన్ని సంపాదించుకున్నాడు. ఆయన దర్శకత్వంలో చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నిజానికి నేను అసలు నటుడిని కావాలని అనుకోలేదు. ఎలాంటి గుర్తింపు లేకుండా చాలా చిన్న జీవితం గడపాలని నాకు ఉండేది. దిగువ మధ్యతరగతి జీవితం గడపాలని ఉండేది. అది తప్పా అన్నీ తీరాయి. ఈ జన్మకి ఇక చిన్నజీవితం గురించి మరిచిపొమ్మని త్రివిక్రమ్ చెప్పాక సెటిల్ అవ్వాల్సి వచ్చింది” అని పవన్‌ చెప్పుకొచ్చారు.

మా అన్నయ్య చిరంజీవిగారు అన్న ఒక మాట నన్ను నటుడిని చేసింది. నీ మీద ఆధారపడిన కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. అన్నదమ్ముల బాధ్యత లేదు. కాబట్టి నువ్వు ఒక నటుడివి అయ్యి ఏదో ఒక పని ఇలాంటి స్పిచ్యువాలిటీ గురించి మాట్లాడతావా అంటే నాకప్పుడు అనిపించింది. ఆరోజు ఆయన అన్న ఆ మాటలు నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టాయి. గుండెల్లో పెట్టుకుని చూసుకునే అభిమానాన్ని నాపై కనబరిచాయి. నిజంగా ‘వకీల్ సాబ్’ చిత్రం చేసినందుకు నేను ఎంతో అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. ఎందుకంటే.. అక్కచెల్లెళ్లు, ఆడపడుచులు, అమ్మ, పెద్దమ్మలు.. అందరూ నన్ను ఎంతో బాగా చూసుకునేవారు. వారందరికీ ఈ ‘వకీల్ సాబ్’ రూపంలో ఓ మూవీ చేసి.. వారి తరపున నిలబడినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను..’’ అని అన్నారు.

- Advertisement -