అన్నయ్య తర్వాత ఆయనే-పవన్‌

234
Pawan Kalyan Speech at Nela Ticket Audio Launch
- Advertisement -

ఎస్ఆర్‌టి ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై ‘ సోగ్గాడే చిన్నినాయనా’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’ వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో.. ‘రాజా ది గ్రేట్‌’తో అదరగొట్టిన మాస్ మహారాజా ‘రవితేజ’ హీరోగా రామ్ తాళ్లూరి నిర్మించిన సినిమా ‘నేల టిక్కెట్టు’. ఈ సినిమా ఆడియో లాంచ్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ విచ్చేశారు. కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ.. హీరో రవితేజ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Pawan Kalyan Speech at Nela Ticket Audio Launch

‘ నేను యాక్టర్ కాకముందు.. రవితేజ క్యారెక్టర్స్ లో యాక్ట్ చేయడం చూశాను. అన్నయ్య తర్వాత అంత దగ్గరగా చూసిన వ్యక్తి ఆయనే. ఆజ్ కా గూండారాజ్ ప్రివ్యూ థియేటర్లో రవితేజను నేను మొదటి సారి చూశాను. అప్పుడు నేను యాక్టర్ ను కాదు కాబట్టి నన్ను ఆయన గుర్తుంచుకోకపోయి ఉండవచ్చు. కానీ నేను గుర్తుంచుకున్నాను’ అంటూ నవ్వులు పూయించాడు పవన్.

‘ఆయన నవ్వుల వెనకాల.. పెర్ఫామెన్స్ వెనకాల.. చాలా కష్టం.. చాలా కృషి ఉన్నాయి. అంతే కాదు చెప్పలేని కష్టాలతో కూడిన బాధలు ఉన్నాయి. ఒక వ్యక్తి ఇంత హాస్యం పండిస్తున్నాడంటే.. గుండెల్లో ఎంతో కొంత ఆవేదన ఉంటుంది.అందుకే రవితేజ అంటే ఇష్టం. నటుడుగా ఎదుగుతున్న స్థాయి నుంచి చూశాను. ఎక్కడా ఆత్మవిశ్వాసం సన్నగిల్లకుండా ఈ స్థాయిలో ఉన్న ఆయన్ని చూస్తే నాకు గర్వంగా అనిపిస్తుంది’ అన్నాడు పవన్.

Pawan Kalyan Speech at Nela Ticket Audio Launch

‘ఈయన ఇంత సిగ్గు లేకుండా ఎలా యాక్ట్ చేస్తాడని అనుకుంటూ ఉంటాను. నేనైతే అలా చేయలేను. తప్పని సరిగా పారిపోతాను. ఎంతమంది జనం ఉన్నా.. సిగ్గు అనే పదాన్ని ఇంట్లో పెట్టేసి వస్తాడు.. అందుకే తను నాకు ఇన్ స్పిరేషన్. దర్శకులు కళ్యాణ్ కృష్ణ కు.. హీరోయిన్ గా నటించిన మాళవిక శర్మకు బ్రైట్ ఫ్యూచర్ అందాలని కోరుకుంటున్నాను.. జైహింద్’ అంటూ తన స్పీచ్ ముగించాడు పవన్.

- Advertisement -