Pawan Kalyan: సూపర్‌ సిక్స్‌ పథకాలకు ప్రాధాన్యత

12
- Advertisement -

సూపర్ సిక్స్ పథకాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన పవన్… ఏపీలో నూతనంగా అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం పంచాయతీరాజ్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వం షణ్ముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నామన్నారు.

రాష్ట్రంలో 28 రకాల సామాజిక పెన్షన్లు అందిస్తు అండగా నిలిచామన్నారు. దేశ భక్తి పెంపొందించే విధంగా మైనర్‌ పంచాయతీలకు పది వేలు, మేజర్‌ పంచాయతీకు రూ. 25 వేలు అందిస్తున్నామని వివరించారు. పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయడం, సర్పంచులకు అధికారాలు, సాతంత్య్ర, గణ దినోత్సవా వేడుకల నిర్వహణకు నిధుల పెంచడం లాంటి కార్యక్రమాలు ప్రారంభించామని స్పష్టం చేశారు.

Also Read:‘ఆయ్’ పెద్ద హిట్ కావాలి: నిఖిల్

- Advertisement -