పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం అజ్ఞాతవాసి. జల్సా, అత్తారింటికి దారేది చిత్రాల తరువాత పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం కావడంతో ఈ మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ‘అజ్ఞాతవాసి’ ట్రైలర్‌ను నూతన సంవత్సర కానుకగా డిసెంబర్ 26న విడుదల చేయనున్నారు.
ఈ సినిమాలో పవన్ పాట పాడటం విశేషం. నూతన సంవత్సరకానుకగా డిసెంబర్ 31న ఈ పాటను విడుదల చేయనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. పవన్ సరసన అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేశ్ హీరోయిన్లుగా నటించారు.
పవన్ పాడిన ‘కొడకా..కోటేశ్వరరావు’ నూతన సంవత్సర కానుకగా రాబోతుంది. గురువారం ఈ పాట రికార్డింగ్ ముగిసినట్లు చిత్రబృందం సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది. పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో పవన్ పాడిన ‘కాటమరాయుడా కదిరీ నరసింహుడా’ పాటకు ఎంత క్రేజ్ వచ్చిందో చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ‘అజ్ఞాతవాసి’లోని ‘కొడకా..కోటేశ్వరరావు’ పాటకూ అంతే ఆదరణ లభిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.