సెక్యులరిజం అంటే ఇదేనా..?:జగన్‌కు పవన్‌ ప్రశ్న

261
jagan
- Advertisement -

హిందువుల పట్ల ఒకలా.. ఇతర మతాల పట్ల మరోలా స్పందించడం తప్పన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అన్ని మతాల పట్ల సమభావమే సెక్యులరిజమని, సెక్యులరిజం అంటే హిందూ ఆలయాలపై దాడులు జరిగితే మౌనంగా ఉండటమా? అని ప్రశ్నించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన పవన్‌..ఆలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.

ఓ రథం పోతే ఇంకో రథం చేయిస్తాం.. విగ్రహం ధ్వంసం చేసే మరో విగ్రహం పెడుతామంటూ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతారా? అని ప్రశ్నించారు. సోషల్‌ మీడియాలో చిన్న పోస్టులు పెడితే నాన్‌బెయిలబుల్‌ కేసులు పెడుతున్నారని ..గిద్దలూరులో జనసేన కార్యకర్త స్థానిక ఎమ్మెల్యేను రోడ్లు సరిగా లేవని నిలదీస్తే .. అతన్ని భయబ్రాంతులకు గురి చేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారని ఆరోపించారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారిపోయాయని, దళితులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

- Advertisement -