కాటమరాయుడు సినిమాతో ఆడియన్స్‌ను, తన అభిమానులను అలరించిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ప్రస్తుతం త్రివిక్రం శ్రీనివాస్ డైరెక్షన్లో నటిస్తున్నాడు. ఈ సినిమాతో మళ్లీ పవన్‌కు పెద్ద హిట్ వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దసరా సీజన్లో విడుదల అవుతుందని తొలుత భావించినా.. సంక్రాంతికి షిప్ట్ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా రిలీజ్ సంగతి అలా ఉంచితే.. సినిమా షూటింగ్‌కి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు టీ టౌన్లో చక్కర్లు కొడుతున్నాయి.
హారిక- హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. ఒక హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కాగా మరో భామ నేనే శైలజ హీరోయిన్ కీర్తి సురేష్. ఇప్పటివరకు చిన్న హీరోలతో మాత్రమే చేసిన ఈ బ్యూటీ ఒక్క సారిగా పవన్‌తో నటించే అవకాశం కొట్టేయడంతో ఉక్కిరిబిక్కిరవుతుందట. ఇక ఇటీవలె పవన్‌తో షూటింగ్లో పాల్గొన్న ఈ బ్యూటీ చాలా ఆనందంగా ఉందని తెలిపింది.
ఈ సినిమాలో వీరిద్దరి మధ్య కెమెస్ట్రీ అద్భుతంగా పండిందని చిత్రయూనిట్ చెబుతోంది. కొన్ని సీన్స్‌లో త్రివిక్రమ్ యాక్షన్ చెప్పిన ఎలాంటి డైలాగ్ చెప్పకుండా పవన్‌ని చూస్తు అలాగే ఉండిపోతుందట ఈ బ్యూటీ. ఇక ఇటీవల రొమాంటిక్ మూడ్‌లో నన్ను పెళ్లి చేసుకుంటావా ప్లీజ్ అనే డైలాగ్ చెప్పేవిషయంలో అందరిని నవ్వించిందట కీర్తి. ప్రేమగా పవన్ వైపు చూస్తు చెప్పే డైలాగ్‌కి పవన్ సైతం తెగ నవ్వేశాడట. ఈ ఒక్క సీన్ కోసం బోలెడన్నీ రీ టెక్‌లు చేశారట.
సరదా సరదాగా సాగుతున్న సినిమా షూటింగ్‌తో యూనిట్ మొత్తం తెగ ఎంజాయ్ చేస్తున్నారట. ఈ సినిమాలో కీర్తిసురేష్ ,పవన్ జంట బాగుందని వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలెట్ కానున్నాయట. ఇక మరోహిరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ సైతం తన అందచందాలను ఆరబోయనుందట. మొత్తంగా రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీతో పవన్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ భోజనం పెట్టడం ఖాయమని ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.