పవన్ నిర్మాతగా చైతూ మూవీ..!

330
pk
- Advertisement -

రీమేక్‌తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలను లైన్‌లో పెట్టిన పవన్‌…నిర్మాతగానూ సినిమా చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

గతంలో పీకే క్రియేటివ్ వర్క్స్‌పై పవన్ హీరోగా అజ్ఞాతవాసి తెరకెక్కిన సంగతి తెలిసిందే. తర్వాత నితిన్ హీరోగా ఛల్ మోహన్ రంగాను నిర్మించారు పవన్‌. తాజాగా దర్శకుడు త్రివిక్రమ్-హీరో నానిలతో కలిసి సినిమా నిర్మించే ప్లాన్‌లో ఉన్నారట పవన్‌.

కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా దశరథ్ సినిమాను ఈ ముగ్గురు కలిసి నిర్మిస్తుండగా అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్నారట. ప్రస్తుతం ఈ వార్త టీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారగా అఫిషియల్ సమాచారం రావాల్సి ఉంది.

- Advertisement -