కేసీఆర్..పనితీరు భేష్‌:పవన్

181
Pawan Kalyan praises KCR
- Advertisement -

రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడం ఆనందకరమైన విషయమని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ని కలిసిన పవన్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ పనితీరు,పాలసీలు బాగున్నాయని ప్రశంసించారు.

తన భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని పవన్ తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నానని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ విషయంలో నాకు చాలడౌట్స్ ఉండేవని…అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించన నేత కేసీఆర్ అని కొనియాడారు.

తెలంగాణ సమర్ధవంతమైన నాయకుడి చేతిలో ముందుకు వెళుతుందని స్పష్టం చేశారు. తెలంగాణను స్పూర్తిగా తీసుకుని ఆంధ్రాలో సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. కేటీఆర్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని తీసుకెళ్లిన పార్టీగా టీఆర్ఎస్ పై తనకు మంచి అభిప్రాయం ఉందన్నారు.

- Advertisement -