“బృందావనమది అందరిది”..

277
- Advertisement -

జస్ట్ ఎంటర్ టైన్‌మెంట్ క్రియేషన్స్ పతాకం పై ప్రముఖ తేజ డైమండ్స్ సికింద్రాబాద్ అధినేత శ్రీనివాస్ వంగల మరియు ప్రభాకర్ రెడ్డి కూతురు (యన్. అర్. ఐ ) నిర్మాతలుగా సక్సెస్ ఫుల్ రచయిత శ్రీధర్ సీపాన దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం “బృందావనమది అందరిది”ఈ మూవీ ప్రధాన నటి నటులను ఇప్పటివరకు ప్రకటించలేదు వాళ్ళని జనవరి1 2018 నూతన సంవత్సరం రోజు ప్రకటించాలని ఈ రోజు మీడియా లో విడుదల చేస్తున్నాము.

ఈ సందర్భం గా దర్శకుడు శ్రీధర్ సీపాన మాట్లాడుతూ.. మా “బృందావనమది అందరిది” మూవీకి ప్రధాన తారగణాన్ని ఈరోజు జనవరి 1 -1- 2018 న మీడియాలో విడుదల చేయడం చాలా సంతోషం గా ఉంది. ముందుగా మీడియా మిత్రులకి నా శ్రేయోభిలాషులకు తెలుగు సినీ ప్రేమికులకు అందరికి 2018 నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను రాసుకున్న స్టోరీ కి కొత్తవాళ్ళు తో చేయాలనుకున్న విషయం మీకు తెలిసిందే చాలా ఆడిషన్స్ వచ్చాయి కానీ ప్రధాన తారాగణం నలుగురు ఆర్టిస్టులను మినహా మిగతా కాస్టింగ్‌లో చాలామంది కొత్తవాళ్ళని తీసుకోవడం జరిగింది వాళ్ళకి ఈ రోజు రెపట్లో మా ఆఫీస్ నుండి మెస్సెజ్ లు పంపించడం జరుగుతుంది. మా ప్రధాన తారాగణంలో ముందుగా మెయిన్ హీరో సిద్దు( గుంటూర్ టాకీస్ ఫేమ్ ) ని తీసుకోవడానికి కారణం ఫ్రెష్ ట్యాలెంట్ గుంటూర్ టాకీస్ లో సిద్దు నటన నాకు నచ్చి నా కథలోని కెరెక్టర్ కి సిద్దు అప్ట్ అని సిద్ధుని తీసుకోవడం జరిగింది.

“Brindavanamadi Andaridi” Main Cast Announcement

రెండవ కీ రోల్ మాస్టర్ విక్రమ్ ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ గారి అబ్బాయి చైల్డ్ ఆర్టిస్ట్ గా విక్రమ్ చేసిన రుద్రమదేవి, రేసుగుర్రం, పటాస్‌లో విక్రమ్ చాలా బాగా నటించాడు ఆ మూవీస్ చూసి విక్రమ్ ని సెలక్ట్ చేయడం జరిగింది విక్రమ్ మంచి ఆర్టిస్ట్ అవుతాడు చాలబాగా చేస్తున్నాడు. మూడవ ఆర్టిస్ట్ రన్ రాజా రన్ ఫేమ్ సీరత్ కపూర్ ఈమె నటన గురించి నేను చెప్పక్కర్లేదు. ఆమె నటనతో మా స్క్రిప్ట్ కి సీరత్ కపూర్ 100%అప్ట్ అవుతుంది. తన గ్లామర్ కూడా సినిమాకి ప్లేస్ అవుతుంది.

“Brindavanamadi Andaridi” Main Cast Announcement

చివరిగా మా నాలుగో పిల్లర్ మా 30 ఇయర్స్ పృద్వి నేను చేసిన ఆహానా పెళ్ళంట మూవీ నుండి ఇప్పటివరకు నాతో నా సినిమాలతో ట్రావెల్ చేసిన మా పృద్వి మరో సారి తన కామెడీ తో నటవిశ్వరూపం మా మూవీ లో చూస్తారు. సింపుల్ గా చెప్పాలంటే నాలుగురూ నా సినిమా కి మెయిన్ పిల్లర్స్ డిసెంబర్ 29 నుండి షూటింగ్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సంక్రాంతి కి “బృందావనమది అందరిది” ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నాము. ముఖ్యమైన విషయం మాకు లగడపాటి శ్రీధర్ సలహాలు సూచనలను ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. శ్రీధర్‌కు మా టీమ్ తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటునము సంక్రాంతి పండుగ కి షూటింగ్ చిన్న గేప్ తీసుకొని జనవరి 20 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది అలాగే నా తరుపున మా చిత్ర యూనిట్ తరపున అందరికి మరోసారి 2018 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు దర్శకుడు శ్రీధర్ సీపాన.

నటీనటులు: సిద్దు (గుంటూర్ టాకీస్ ఫేమ్) ,లగడపాటి విక్రమ్ (రేసుగుర్రం ఫేమ్), సీరత్ కపూర్ (రన్ రాజా రన్ ఫేమ్) పృద్వి (30 ఇయర్స్ ఇండస్ట్రీ), ఆదుర్స్ రఘు , బొడ్డ నారాయణ, సత్యం రాజేష్, ఆదర్స్, జూనియర్ రామిరెడ్డి, శివనారాయణ, రజిత, నోబెల్ సురేష్ యాదవ్. టెక్నిషియన్స్: సంగీతం : మణిశర్మ, కెమెరా : సి. రాంప్రసాద్, ఎడిటర్ : ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ : తిరుమల, పాటలు : సిరివెన్నెల సీతారామశాస్త్రి ,ప్రొడక్షన్ ఎక్సుక్యూటివ్: నాగమధు. గిద్దలూరు, నిర్మాతలు : శ్రీనివాస్ వంగాల, ప్రభాకర్ రెడ్డి కూతురు, కాస్టింగ్ డైరెక్టర్ : వెంకట్ చంద్ర, పి.ఆర్. ఓ. కడలి రాంబాబు, రచన దర్శకత్వం : శ్రీధర్ సీపాన.

- Advertisement -